Breaking Newsక్రైంజాతీయంతెలంగాణ

ED : కవిత అరెస్టుపై ఈడి కీలక ప్రకటన విడుదల..!

ED : కవిత అరెస్టుపై ఈడి కీలక ప్రకటన విడుదల..!

మన సాక్షి :

సంచలనం కలిగించిన లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కీలకమైన ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 245 ప్రాంతాలలో సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నది. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 15 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నది . ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ నాయక్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు ప్రకటనలో తెలిపింది.

మొత్తం 128.79 కోట్లు రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపింది . కవిత ఇంట్లో ఈనెల 15వ తేదీన సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు సోదాలకు ఆటంకం కలిగించినట్లు ప్రకటనలో పేర్కొన్నది . ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని, 100 కోట్ల రూపాయలను అప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలకపాత్ర పోషించినట్లు వెల్లడించింది.

అరవింద్ కేజ్రీవాల్, మనీ షిసోడియాతో కలిసి ఎమ్మెల్సీ కవిత కుట్రపాన్నారని దర్యాప్తులో వెలడైనట్లు వివరించింది. చిన్న వ్యాపారుల నుంచి డబ్బులు సేకరించి ఆప్ నేతలకు చేరవేశారని ప్రకటనలో పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటివరకు ఒక ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, ఐదు అనుబంధ ఫిర్యాదులను దాఖలు చేశామని, 24 జనవరి 2023 నుంచి 3 జూలై 2023 మధ్యకాలంలో 128.79 కోట్ల రూపాయలను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. ఈ కేసు కు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుందని తెలియజేసింది.

RELATED NEWS : 

Ed Office : ఈ డి ఆఫీస్ కు కేటీఆర్..!

Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టులు ఎన్నో తెలిస్తే షాక్..!

Suryapet : కవిత అరెస్టుకు నిరసనగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాస్తారోకో..!

BIG BREAKING : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హై టెన్షన్..!

BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు జలక్.. ఎన్నికల ముందు ఆమె ఇంట్లో ఈడీ సోదాలు..!

మరిన్ని వార్తలు