BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు జలక్.. ఎన్నికల ముందు ఆమె ఇంట్లో ఈడీ సోదాలు..!

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు ఈడి జలక్ ఇచ్చింది. ఢిల్లీ నుంచి పదిమంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఉన్నట్లు తెలిసింది.

BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు జలక్.. ఎన్నికల ముందు ఆమె ఇంట్లో ఈడీ సోదాలు..!

తెలంగాణ బ్యూరో, మన  సాక్షి:

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు ఈడి జలక్ ఇచ్చింది. ఢిల్లీ నుంచి పదిమంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఉన్నట్లు తెలిసింది.

మొత్తం నాలుగు టీములుగా ఏర్పడి సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలు, ఇతర లావాదేవీలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కవిత నివాసంతో పాటు హైదరాబాదులోని పలుచోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఐటి సోదాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. లోక్ సభ ఎన్నికలకు రేపు షెడ్యూల్ ప్రకటించే విషయం తెలిసిందే. సరిగ్గా ఒక్కరోజు ముందే కవిత నివాసం వద్ద ఐటీ సోదాలు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇది ఇలా ఉండగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అధికారులు ఆమెని ప్రశ్నిస్తున్నారు. సిబీఐ అధికారులు కూడా ఆమెకు నోటీసు ఇచ్చారు. ఇలాంటి తరుణంలో ఐటి, ఈడి సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

ALSO READ : Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!