క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత.. ఎనిమిది మంది అరెస్టు..!

Miryalaguda : పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత.. ఎనిమిది మంది అరెస్టు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

అక్రమంగా పిడిఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు మిర్యాలగూడ రాజశేఖర్ రాజు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ టూ టౌన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద లారీలను తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి లారీలు చెక్ చేయగా అవి పిడిఎస్ బియ్యం గా గుర్తించామన్నారు. అందులో ప్రయాణిస్తున్న వారిని లారీ డ్రైవర్ ను విచారించగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి ఆంధ్ర ప్రదేశ్ , గుంటూరు జిల్లా కు చెందిన కొమ్మలపాటి శ్రీనివాస్ బాలాజి నగర్, జీరో లైన్, గుంటూర్ ఆర్బన్ అను అతను గుంటూర్ జిల్లాలో పత్తిపాడు ఏరియా, వట్టిచెరుకూరు మండలములలో, చామలముడి గ్రాముము లో వెంకట సుబ్బ రావు పద్మజ రైస్ ట్రేడర్స్ నందు గుమస్తాగా 2013 నుండి పని చేస్తున్నాడు.

గూడ్స్ అప్పి ఆటొ నడుపుకుంటూ, అక్కడ పిడిఎస్ బియ్యము కి సంభందించిన అన్నీ విషయాలు మరియు లావాదేవీలు తెలుసుకొని పద్మజ రైస్ ట్రేడర్స్ మిల్లు ని బియ్యాన్ని ప్రాసెసింగ్ చేయటానికి ఉపయోగించుకొనేవాడు. మిల్లు ఓనర్ అయిన వెంకట సుబ్బరావు ఆదేశాల మేరకు చుట్టుపక్కల మండలాలు చెరుకూరు, నల్లపాడు, లాలాపేట, కాకాని, పత్తిపాడు కి సంభందించిన గ్రామలలో పాటు తెలంగాణా రాష్ట్రం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు గ్రామాల నుండి కూడా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రభుత్వము పేదలకు సరఫరా చేసే పి‌డి‌ఎస్ బియ్యమును కిలో ఒక్కటికి 11 రూపాయల చొప్పున కొని, వాటిని తన యొక్క టాటా ఏసీ వాహనము, అతని యొక్క స్వంత రెండు అప్పి ఆటోలలో బియ్యమును వెంకట సుబ్బ రావు పద్మజ రైస్ ట్రేడర్స్ మిల్లు లో పాలిష్ చేసి వాటిని ఆర్మూర్, ఒరిస్సా, గుజరాత్, తమినాడు, పుదుచేరి, కాకినాడ, ప్రాంతాలకు కావల్సిన వారికి సరఫరా చేస్తూ, వారికి అధిక ధరలకు ఒక కిలో కి 35 రూపాయలకు అమ్మి అక్రమ లాభార్జన గావించుచున్నాడు.

పిడుగురాళ్ళకి చెందిన మహేశ్ రెడ్డి అనే అతను చూసుకొనే వాడు, అందుకు మహేష్ రెడ్డి కి నెల నెలకు. 3,00,000 రూపాయల ఇచ్చేవాడు. శ్రీనివాస్ సేకరించిన పి‌డి‌ఎస్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేసేందుకు రమేశ్, వాసు అలియాస్ శ్రీనివాసు అనే బ్రోకర్లు, ఇతని పిడిఎస్ బియ్యం వ్యాపారమునకు సహకరించే వారు.

ఈ నెల 5 న రమేశ్ కు గుజరాత్ రాస్ట్రానికి చెందిన మన్సూక్ భాయి కు పి‌డి‌ఎస్ బియ్యం కావాలని చెప్పగా, రమేశ్ పంపించిన లారీ నందు గతంలో తెలంగాణా రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుండి మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్న పి‌డి‌ఎస్ రైస్ ను ఇతను 600 తెల్లని ప్లాస్టిక్ సంచులలో అందాజ 300 క్వింటాల పి‌డి‌ఎస్ బియ్యము లోడ్ నల్లపాడు బైపాస్ రోడ్ వరకు శ్రీనివాస్ రావు దాటించినాడు.

ఆ తరువాత రమేశ్, మహేశ్ రెడ్డి కి లారీ గుజరాత్ వెళ్తునది దానికి సంబండిచిన రోడ్ పై ఎక్కడ కూడా ఆగకుండా చూసుకోమని చెప్పి వెళ్ళినాడు. ఈ విధంగా అక్రమంగా వీడియోస్ బియ్యాన్ని తరలిస్తున్నారని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా శరత్ చందర్ పవర్, ఆదేశముల మేరకు వాడపల్లి లోని చెక్ పోస్ట్ వద్ద వాహనములు తనఖి చేస్తున్న పోలీసు సిబ్బంది అట్టి లారీ ని ఆపి తనిఖీ చేసి పట్టుబడి చేసినారు.

గురువారం డ్రైవరు శ్రీనివాస్ రావు కు ఫోన్ చేసి వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసు వారు లారీ ని పట్టుబడి చేసినారు అని తెలుపగ, శ్రీనివాస్ రావు వెంటనే ఇట్టి విషయాన్ని రమేశ్ , మహేశ్ రెడ్డి కి తెలియపరిచి, శ్రీనివాస్ రావు వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కు రాగా పోలీసు వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనమైన చేసుకున్న దొంగ సొత్తు మొత్తం విలువ సుమారు రూ. 10.50 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. కేసును ఛేదించటములో మిర్యాలగూడ డీస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, వాడపల్లి ఎస్‌ఐ ఏ. శ్రీకాంత్ రెడ్డి, త్రిపురారం ఎస్‌ఐ, కే. నరేశ్ సిబ్బంది అభినందించారు.

MOST READ :

  1. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

  2. Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!

  3. SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

  4. Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!

మరిన్ని వార్తలు