BREAKING : ఎపిటోరియా పరిశ్రమలో కార్మికుడు మృతి..!

సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే.. ఇలా ఉన్నాయి. బోర్పట్ల గ్రామ శివారులోని ఏపీటోరియా యూనిట్ -1 పరిశ్రమలోని పనిచేస్తున్న కార్మికుడి మృతి చెందినట్లు సమాచారం.

BREAKING : ఎపిటోరియా పరిశ్రమలో కార్మికుడు మృతి..!

హత్నూర,మన సాక్షి:

సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే.. ఇలా ఉన్నాయి. బోర్పట్ల గ్రామ శివారులోని ఏపీటోరియా యూనిట్ -1 పరిశ్రమలోని పనిచేస్తున్న కార్మికుడి మృతి చెందినట్లు సమాచారం.

మృతి చెందిన కార్మికుడు బోర్పట్ల గ్రామానికి చెందిన కొప్పుల నర్సింలుగా గుర్తించారు. పరిశ్రమ యజమాన్యంగుట్టు చప్పుడు చేయకుండా సంగారెడ్డి ఎంఎన్ఆర్ ఆసుపత్రికి తరలించగా స్థానిక గ్రామస్తులు మృతదేహాన్ని అంబులెన్స్ లో పెట్టి పరిశ్రమ ముందు ధర్నా చెశారు. సంఘటన స్థలానికి సీఐ వేణు కుమార్, ఎస్ ఐ కే సుభాష్ చేరుకొని వివరాలు అడిగి విచారణ చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ : Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!