దేవతల కొండపై గుప్తనిధుల తవ్వకాలు.. అత్యంత ఖరీదైన పురాతన విగ్రహాల చోరీ..!
దేవతల కొండపై గుప్తనిధుల తవ్వకాలు.. అత్యంత ఖరీదైన పురాతన విగ్రహాల చోరీ..!
టేక్మాల్, మన సాక్షి ప్రతినిధి:
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దేవతల కొండపై గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు 11వ శతాబ్దానికి చెందినదిగా ప్రాచుర్యంలో ఉన్న పార్శనాథుడు తీర్థంకర ఏక శిలా విగ్రహాం అపహరణకు గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామ శివారులో తుంబురీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం చెరువు పక్కన ఉంది. చెరువు మధ్యలో ఉన్న పెద్ద గుట్టపై దిగంబర అవతారంలో జైన మతానికి చెందిన 5వ శతాబ్దానికి చెందిన 23వ పార్శనాథుడు, తీర్థంకర పురాతన ఏకశిలా విగ్రహాం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహాలు మరెక్కడ లేవని స్థానికులు పేర్కొంటున్నారు. అత్యంత ఖరీదైనవిగా ఈ విగ్రహాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే శుక్రవారం ఉదయం మేకలు మేపడానికి సూరంపల్లి గ్రామానికి చెందిన తాడూరి సాయిలు అనే వ్యక్తి గుట్టపైకి వెళ్లాడు. అక్కడ మేకలను మేపుతున్న అతను విగ్రహాం ఉండే చోటుకు వెళ్లాడు. అక్కడ విగ్రహాం కనిపించకపోవడంతో స్థానికులకు సమాచారాన్ని అందించారు. దీంతో సూరంపల్లి, వేల్పుగొండ గ్రామస్తులు గుట్టపైకి వెళ్లారు. అలాగే టేక్మాల్ పోలీసులకు సమాచారాన్ని అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహాం ఉండే పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించడానికి టైర్లు, ట్యూబులు, తాళ్లు, కర్రల సహాయంతో నీటిలో నుంచి తరలించినట్లుగా ఆనవాలు ఉన్నాయనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
వేల్పుగొండ మాజీ సర్పంచ్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దయానంద్ తెలిపారు. గతంలో ఈ గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు సైతం చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. విలువైన చారిత్రక సంపద అపహరణకు గురికావడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
LATEST UPDATE :
Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!
TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!
రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!











