విద్యుత్ షాక్ తో రైతు మృతి..!
విద్యుత్ షాక్ తో రైతు మృతి..!
నేలకొండపల్లి, మన సాక్షి:
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు రైతు మృతి చెందిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని చెరువుమాధారం గ్రామంకు చెందిన పరిటాల లింగయ్య (57) అనే రైతు మంగళవారం తన వ్యవసాయ పొలం వద్ద కింద పడ్డ బోరు మోటారు తీగను పైకి గుంజుతుండుగా ప్రమాదవశాత్తు షాక్ కు గురైయ్యాడు.
తీగలు కర్ర కు కట్టటం వలన అవి కింద కు వాలాయి. దీంతో దానిని పైకి లాగేందుకు పని చేస్తుండుగా…ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మృతదేహం ను సోసైటీ మాజీ చైర్మన్ ఈవూరి శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన రైతు నిండు ప్రాణాలను వదిలాడని వాపోయాడు. ప్రభుత్వం బాధిత రైతు
కుటుంబం ను ఆదుకోవాలని కోరారు.









