క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతి చెందిన ఘటన కంగ్టి మండలంలో జరిగింది. ఎస్ఐ దుర్గారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో జరిగింది. ఎస్ఐ దుర్గారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చాప్టా ( బీ ) గ్రామానికి చెందిన రైతు బాలాజీ రావు పాటిల్ (43 ) గురువారం తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. వాగులోని నీటిని మోటార్ ద్వారా మొక్కజొన్న పంటకు వదుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం నీటిని పారబెట్టేందు మోటర్ అన్ చేయడానికి స్టార్టర్ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో స్టార్టర్ లోని ఒక విద్యుత్ వైర్ ప్రమాదవశాత్తు తెగిపడి కాలిపై పడడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వ్యవసాయమే వారి కుటుంబం జీవనాధారం కావడంతో బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కంగ్టి, మన సాక్షి 

MOST READ : 

మరిన్ని వార్తలు