రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరో అవకాశం కల్పించింది. రైతుల సంక్షేమానికి గాను ఈ పథకం వర్తింప చేస్తుంది. రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందించే ఈ పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
రైతు బీమా :
తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకానికి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తుంది. అందుకు సంబంధించిన దరఖాస్తులు అర్హులైన వారు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా పాస్ బుక్ లు పొందిన వారు, రైతు బీమా గతంలో లేనివారు దరఖాస్తులు చేసుకోవచ్చును. ఆగస్టు 5 , 2024 లోపు అవకాశం ఉంది.
కావలసిన పత్రాలు :
రైతు బీమాకు దరఖాస్తు ఫారం.
రైతు పట్టాదారు పాసుబుక్.
రైతు ఆధార్ కార్డు,
నామిని ఆధార్ కార్డు. తప్పనిసరిగా అవసరం.
అర్హతలు :
1965 ఆగస్టు 14వ తేదీ నుండి 2006 ఆగస్టు 14వ తేదీ మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకు అర్హులు. ఆధార్ కార్డులో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. రైతు బీమా దరఖాస్తులతోపాటు గతంలో భీమా చేసుకున్న రైతుల బీమా లో మార్పులు చేర్పులు, ఆధార్ లేదా నామిని చనిపోతే మార్పులు జులై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలతో వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
ఈ పథకంలో దరఖాస్తు చేసుకొని అర్హులైన రైతు చనిపోతే నామినీకి పది రోజుల్లోగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను చెల్లిస్తుంది.
ALSO READ :
Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!
Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!









