District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
పెన్పహాడ్, మన సాక్షి:
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పెన్ పహాడ్ మండల కేంద్రం లోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అనాజిపురం ఐకెపి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించినారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కాంటాలలో, ధాన్యం ఎగుమతులలో, రైతులను ఇబ్బంది పెట్టకుండా వేగవంతం పెంచాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. కాంటాలలో ఎటువంటి తేడాలు వేసిన, రికార్డులు సక్రమంగా లేకపోయినా, ఎటువంటి అక్రమాల పాటుపడిన, సట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, మండల రెవెన్యూ అధికారి ధారావత్తు లాలు నాయక్, మండల అభివృద్ధి అధికారి జన్జనాల వెంకటేశ్వరరావు ఏ, పి ఎం అజయ్ నాయక్, మండల వ్యవసాయ అధికారి భానోత్ అనిల్ కుమార్ నాయక్, ఏ పి ఓ రవి, పెన్ పహాడ్ ఎస్సై కస్తాల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District Collector : భూ భారతి చట్టంతో భూ తగాదాలకు చెక్.. జిల్లా కలెక్టర్..!
-
Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)
-
District Collector : సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఐకెపి సెంటర్ తనిఖీ..!
-
Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!
-
Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!









