Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలువ్యవసాయం

District Collector : సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఐకెపి సెంటర్ తనిఖీ..!

District Collector : సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఐకెపి సెంటర్ తనిఖీ..!

జగిత్యాల, (మన సాక్షి)

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని  జిల్లా  కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. సోమవారం  మెట్ పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ మహిళా సమాఖ్య ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో ముత్యంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్యాక్స్  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,  కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్ గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని , నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని ఎలక్ట్రికల్ తూకం ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయాలని తెలిపారు.

ధాన్యం తరలింపు సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ వడగళ్ల పడుతాయి కాబట్టి తాటి పత్తర్లు అందుబాటులో తాగునీరు ఉండేలా చూడాలని ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు.

ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలును. కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు . ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్  డేటా ఎంట్రీ  చేయాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.

గ్రేడే ఏ రకం ధాన్యానికి క్వింటాల్ 2320 రూపాయల, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట  మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్  డిఆర్డిఓ పిడి రఘువరన్  ఎంపీడీవో ఎమ్మార్వో శ్రీనివాస్  సివిల్ సప్లై అధికారులు  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District collector : ప్రతి రైతుకు భూభారతితో న్యాయం.. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్..!

  2. Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

  4. Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!

  5. TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు