Rythu : రైతులు వాటి వినియోగాన్ని తగ్గించాలి..!
Rythu : రైతులు వాటి వినియోగాన్ని తగ్గించాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శనివారం వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎం. పరిమళ కుమార్, జెడి. సరిత ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు.
వారు మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించాలని దాని స్థానంలో పచ్చి రొట్టె ఎరువులు, వర్మి కంపోస్టు, మరియు జీవన ఎరువులను వాడాలని తెలిపారు. అధిక రసాయనాల వలన కలిగే నష్టాలను రైతులకు వివరించారు.
ప్రత్యామ్నాయ మార్గాలైన జీవ నాశనీలు ఎరువులు అయినా రైజో బియ్యం, ట్రైకోడెర్మా, సూడో మోనాస్ లు వంటివి వేసుకోవాలని సూచించారు. సాగు ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నేల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ విత్తన కొనుగోలు, విత్తన శుద్ధి మరియు రసీదులను భద్రపరచుకోవడం పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యాస్ ఆచార్య, ఏవో. బాల దినకర్, ఏఈఓలు. అనిల్ కుమార్, సుధాకర్, ప్రకాష్, రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!
-
Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం..!
-
Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!









