ఫర్టిలైజర్ దుకాణాల ఆకస్మిక తనిఖీ

ఫర్టిలైజర్ దుకాణాల ఆకస్మిక తనిఖీ

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వివిధ ఫెర్టిలైజర్స్ మరియు రైతు విత్తన కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి పలు రికార్డులను పరిశీలించడం జరిగింది. నకిలీ మరియు నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టి మోసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏడిఏ వెంకటేశ్వరరావు తెలిపారు.

 

అదేవిధంగా వచ్చిన స్టాకు లిస్ట్ తెలపకుండా విక్రయించకూడదని, రైతులు విత్తనాలు కొనేటప్పుడు ప్యాకెట్ తో పాటు రసీదు కూడా తీసుకోవాలన్నారు. మంచి రకం మేలు రకం నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు పడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు .

 

ఈ కార్యక్రమంలో రామన్నపేట ఏవో యాదగిరిరావు వలిగొండ ఏవో బి అంజనీ దేవి వలిగొండ మండల ఎస్సై పెండ్యాల ప్రభాకర్ పాల్గొన్నారు