తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంక్షేమం

CM Revanth Reddy : పేద ప్రజలకు పండుగ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..!

CM Revanth Reddy : పేద ప్రజలకు పండుగ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు మరో శుభవార్త తెలియజేసింది. పేదల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొన్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇండ్లు నిర్మించేందుకు పనిచేస్తుంది.

కాగా గురువారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ ను సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెరిగిన ధరలకు అనుగుణంగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. గతంలో ఉన్న పెండింగ్ బిల్లులను కూడా 190 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వంపై 22,500 కోట్ల రూపాయల భారం పడుతుందని అయినా కూడా పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు మొదటి దఫలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున నిర్మించనున్నట్లు తెలిపారు.

రేపటి నుంచే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే యాప్ ద్వారా చేపట్టనున్నట్లు తెలియజేశారు. సర్వే యాప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సెక్రటేరియట్ లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు