Breaking Newsక్రైంప్రపంచం
అమెరికాలో అగ్ని ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి

అమెరికాలో అగ్ని ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో భారతకాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం జరిగింది.
జనగాం జిల్లా స్టేషన్ఘఘన్పూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూరుపల్లికి చెందిన ఉడుమల సహజారెడ్డి(24) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది.
ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె, ఇప్పుడు ప్రాణం కోల్పోయిందన్న వార్తతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగి పోయింది.









