Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

BREAKING : షార్ట్ సర్క్యూట్తో ఆటోమొబైల్స్ దగ్ధం..!

BREAKING : షార్ట్ సర్క్యూట్తో ఆటోమొబైల్స్ దగ్ధం..!

– అగ్నికి ఆహుతి అయిన సాయి వెంకటేశ్వర ఆటోమొబైల్స్,

కంగ్టి,మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా తడ్కల్ మండల కేంద్రంలోని స్థానిక పాఠశాల ప్రహరీ గోడకు అనుకొని ఉన్న సాయి వెంకటేశ్వర ఆటోమొబైల్స్ లో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకసారిగా మంటలు చెలరేగడంతో షాపు అగ్నికి ఆహుతి అయ్యింది.

పక్కనే ఉన్న తోటి షాప్ యజమానులు వెంటనే స్పందించి దగ్గరలోనే ఉన్న హోటల్ లో నుంచి నీళ్లు పోసి మంటలు చెల్లారపడం జరిగింది. ఈ సందర్భంగా షాప్ ఓనర్ గొల్ల అశోక్, గొల్ల సాయన్న మాట్లాడుతూ షాపులో ఉన్న ప్యాకింగ్స్, హైట్రలిక్ పైప్స్,ఆయిల్ ఫిల్టర్స్,డీజిల్ ఫిల్టర్స్, ఆయిల్ క్యాన్స్,రెండు కౌంటర్లు,మొత్తం అగ్నిలో కాలిపోవడం జరిగిందని అన్నారు.

దాదాపు 5 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు.

ALSO READ : BREAKING : తెలంగాణలో కరోనా కేసులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు