ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం

ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం

చింతపల్లి, మనసాక్షి.

మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్ లో మార్కెట్ యాడ్స్ రూపంలో బుడగ జంగాల కాలనీలో గుడిసెలు వేసుకొని సుమారు 10 సంచార జీవుల కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. శుక్రవారం ప్రమాదవశాత్తు గుడిసెకు ని పట్టుకొని పూర్తిగా దగ్ధమైంది.

 

బాధితుడు మోతే కృష్ణ అతని భార్య పద్మ ఉదయం కూలిపరులకు వెళ్ళగా పిల్లలు అరవింద్, ఆనంద్లులు ఆ కాలనీలోనే ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గుడిసెకు నిప్పంటుకుంది. దీంతో అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది జంగాల కాలనీవాసులు దగ్ధమవుతున్న గుడిసె మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు.

 

అప్పటికే గుడిసె పూర్తిగా దగ్ధమై గుడిసెలో ఉన్న వంట సామాగ్రి బియ్యం వస్తువులు కట్టుబట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పూర్తిగా నిరాశ్రయులైన సంచార జీవుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కాలనీవాసులు గ్రామ పెద్దలను వేడుకుంటున్నారు. పొట్ట కూటికోసం ఊరు రా తిరుగుతూ జీవనం సాగిస్తున్న సంచార జీవులను ప్రభుత్వం ఆదుకోవాలని నిరుపేదలైన ఆ కుటుంబాలను

 

ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రభుత్వ పక్కా గృహాలు మంజు వచ్చారని పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమకు తమకు తోచిన విధంగా నా కుటుంబానికి సహాయ సహకారాలు అందజేశారు.