TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుంది. రైతుల రుణాలను మాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేసింది. రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేశారు.

అదేవిధంగా రైతులకు రైతు భరోసా పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించ నున్నారు. గతంలో రైతుబంధులో ఉన్న అవకతవకలు అక్రమాలను వెలికి తీసి వారిపై అక్రమార్కులపై చర్యలు కూడా తీసుకోనున్నారు. అదేవిధంగా రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు.

రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి 15 వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందించనున్నారు. ఈ పథకంలో మార్గదర్శకాలను నిర్దేశించడానికి రుణమాఫీ కార్యక్రమం వల్ల రైతు భరోసా ఆలస్యమైంది. వాస్తవానికి జూన్, జూలై మాసంలోనే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది. కానీ గతంలో ఉన్న పొరపాట్లు మరోసారి జరగకుండా ఉండేందుకు గాను రైతుల ద్వారా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు నిర్దేశించినట్లు సమాచారం. రైతు భరోసా పథకంలో ఎక్కువ మంది రైతుల అభిప్రాయం మేరకు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలని డిమాండ్ వచ్చింది.

అందుకు ప్రభుత్వం 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా అందించనున్నారు. అదేవిధంగా గుట్టలు, చెట్లు, సాగుకు యోగ్యం కానీ భూములకు కూడా గతంలో రైతుబంధు అందించారు. రైతు భరోసా పథకం అలా కాకుండా కేవలం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అందించనున్నారు.

ఉన్నత అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందించరు. కేవలం రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అందించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. మరో 15 రోజుల్లో రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడతగా ఎకరానికి 7500 చొప్పున పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు సమాచారం.

LATEST UPDATE : 

District collector : గురుకుల పాఠశాల టాయిలెట్స్, మెస్ డోర్స్ మరమ్మతులు చేయించాలి.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

Miryalaguda : మిర్యాలగూడ సిఐ సుధాకర్ పై వేటు..!

కలెక్టర్ సారూ.. జర ఇటు సూడరూ.. చెట్లు ఎందుకు నరికారో..!

Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!

మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!

మరిన్ని వార్తలు