Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినిలకు అస్వస్థత..!
Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినిలకు అస్వస్థత..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా పీఏ పల్లి దుగ్యల మోడల్ స్కూల్ హాస్టల్ కి చెందిన 07మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే దేవరకొండ ఆస్పత్రికి తరలించారు.
సోమవారం రాత్రి నుంచి విద్యార్థులు హాస్టల్ లో అస్వస్థత గురై ఉన్నడం వలన హాస్టల్ ఎస్ ఓ విషయం బయటకు పొక్క కుండా కప్పి పుచ్ఛి పెట్టడం జరిగింది.. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యబృందం వెంటనే చికిత్స అందించగా వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థుల కోసం నిన్న రాత్రి భోజనం సాంబార్ తయారు చేశారు. అది తిన్న తరువాత చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.రాత్రి నుంచి పాఠశాలలోని కొందరు బాలికలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైయ్యారు.
VIDEO
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం లోని మోడల్ స్కూల్ హాస్టల్ లో విద్యార్థిని కి ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స అందిస్తున్న వైద్యులు pic.twitter.com/zumneI4Sby
— Nagireddy (NAG) (@NagNagireddynag) December 3, 2024
విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయ్యిందన్న వార్త వారి తల్లిదండ్రులకు తెలియగానే ఆందోళనకు గురై వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటపై పాఠశాల అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
అస్వస్థతకు గురైన మోడల్ స్కూల్ హాస్టల్ పాఠశాల బాలికలను ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కలుషిత ఆహారం తినడం వల్లే మోడల్ స్కూల్ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైయ్యారని ఇందుకు బాద్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
MOST READ :
-
CM Revanth, Thalasani : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..!
-
Nalgonda : 7న నల్గొండలో బహిరంగ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో కబురు.. భరోసా కల్పించిన ప్రభుత్వం..!
-
Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. పసిడి మరోసారి భారీగా పతనం..!









