సెల్ టవర్ ఎక్కిన రైతు , ఎందుకంటే..? – latest news

సెల్ టవర్ ఎక్కిన రైతు , ఎందుకంటే..?

మాడ్గులపల్లి, మనసాక్షి: తన వ్యవసాయ భూమి నుండి బాట ఇవ్వాలని ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని పలుమార్లు రెవిన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెంది రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన శనివారం మాడ్గులపల్లి మండలంలో చోటుచేసుకుంది.

మండలంలోని కన్నేకల్ గ్రామానికి చెందిన రైతు గంటకంప యాదయ్య కు కన్నెకల్ రెవిన్యూ సర్వే నెంబర్ శివారులో 242 లో ఉంచి అదే గ్రామానికి చెందిన వ్యక్తి బాటచేసుకొని తన వ్యవసాయ భూమిలోకి వెళ్తూ ఈదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతుండగా పలుమార్లు రెవిన్యూ పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయింది.

దింతో విసుగుచెంది శనివారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు దిగేదిలేదని బిస్మించుకొని కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతుకు నచ్చచెప్పడంతో కిందకు దిగాడు.