BIG BREAKING : పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు మృతి.. మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

BIG BREAKING : పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు మృతి.. మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

హత్నూర, మార్చి 06,మన సాక్షి:
పరిశ్రమలో రియాక్టర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ శివారులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ శివారులోని కూలెంట్ కంపెనీ లో మంగళవారం అర్ధరాత్రి రియాక్టర్ పేలడంతో హత్నూరకు చెందిన వినోద్ కుమార్ (30), జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులు సాధిన్ , ఫాదర్ మారండి, బాబు మృతి చెందారు.

భద్రత లోపం కారణంగానే కార్మికుల మృతి చెందాలని వినోద్ కుమార్ కు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం పరిశ్రమ ఎదుట ఆందోళన నిర్వహించారు.

నిన్న జరిగిన ప్రమాదానికి ఇప్పటి కూడా యాజమాన్యం స్పందించకుండా మొండిగా వ్యవహరించడం సరికాదని, పోలీసులు అధికారులు కంపెనీ వాళ్లకు మద్దతు తెలుపుతున్నారని కుటుంబాలకు న్యాయం చేసేంతవరకు ధర్నా విరమింపబోమని ఎమ్మార్పీఎఫ్ నాయకులు, బంధువులు కుటుంబ సభ్యులు తెలియజేశారు.