ములుగు : స్నేహితుని పెళ్లికివచ్చి..!

గోదావరిలో మునిగి శవమైతేలిన యువకుడు

ములుగు : స్నేహితుని పెళ్లికివచ్చి..!

గోదావరిలో మునిగి శవమైతేలిన యువకుడు

వెంకటాపురం, మనసాక్షి :

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రారం గ్రామానికి చెందిన రావుల. బాబురావు కుమారుడైన రావుల.రాజు వివాహానికి శుక్రవారం నాడు నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్ పర్వతగిరి నివాసి అయిన.రహీంసయ్యద్ పాషా హాజరయ్యారు. ఐదుగురు స్నేహితులు కలిసి రామచంద్రపురం పంచాయతీలోని అంకన్నగూడెం గ్రామ సమీపంలో గోదావరి నది వద్దకు స్నానానికి వెళ్లారు.

 

ఐదుగురిలో రహీంసయ్యద్ పాషా,అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి గల్లంతయ్యారు. మిగిలిన నలుగురు యువకుల్లో ఎవరికి ఈత రాకపోవడం వలన గోదావరిలో మునిగి పోతున్న స్నేహితుని చూసి ఆర్తనాదాలు చేస్తూ దగ్గర్లో ఉన్న గ్రామస్తులకు తెలియచేశారు.

విషయం తెలుసుకున్న వెంకటాపురం ఎస్సైకొప్పుల తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. వెలుతురు సరిగా లేక రాత్రి కావడంతో మరల శనివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెతికి తీసి.పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏకైక కుమారుడు కావడం వల్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు