క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

చింతపల్లి. మన సాక్షి

క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి మనోవికాసానికి ఎంతో దోహదపడతాయని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం కొండ మల్లేపల్లిలో పట్టణంలో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి తరానికి క్రీడలు ఎంతో ప్రాముఖ్యతను చాటుకోనున్నాయని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు ముందుకు వెళుతుందన్నారు. ప్రతి ఒకరు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని తమ ప్రతిభ పాట వాల ను ప్రదర్శించుకోవాలన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడల్లో నైపుణ్యం పొందిన క్రీడాకారులే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాణించగలుగుతున్నారని వారు పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గం లోని క్రీడాకారులకు కళాకారులకు తన సహకారాలు ఎల్లప్పుడూ అందించబడతాయని వారు పేర్కొన్నారు. మల్లెపల్లి దేవరకొండ పట్టణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల కోసం ప్రభుత్వంతో చర్చించి క్రీడల కోసం మినీ స్టేడియాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఐటీ మంత్రి గారితో త్వరలో ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం సంఘ అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ బి ఆర్ ఎస్ నాయకులు పసునూరి యుగంధర్ రెడ్డి రైతుబంధు అధ్యక్షుడు కే సాని లింగారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రామావత్ దసురు నాయక్ మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ ఉప సర్పంచ్ గంధం సురేష్ రామ వత్ తులసి రామ్ రావుల సత్యనారాయణ వసకుల కాశయ్య రామావత్ భీమ్ సింగ్ రావుల వెంకటయ్య జాగరు బావాజీ కోడిదాల వెంకటయ్య క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.