బిగ్ బ్రేకింగ్ : గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం , ముగ్గురు మృతి

బిగ్ బ్రేకింగ్ : గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం , ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం శంకర్ పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారువ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు .గాయాలైన వారిలో కూడా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు నిజాంపేటకు చెందినవారుగా భావిస్తున్నారు.

 

నిజాంపేటకు చెందిన దివ్యకు వివాహం నిశ్చయమైంది. కాగా బ్యాచిలర్ పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి టిఫిన్ చేయడానికి కారులో నార్సింగి సిబిఐటి నుంచి ఖానాపూర్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పోచమ్మ దేవాలయం వద్ద నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది.

 

ప్రమాదం దాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయాయి. తీవ్ర గాయాలతో దివ్య తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.