Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్క్రైం
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
మెలియాపుట్టి , మన సాక్షి :
ఒరిస్సా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 7.6 కేజీల గంజాయి మెలియాపుట్టి మూడు రోడ్లు కూడలిలో ఎస్సై టి. రాజేష్ పట్టుకున్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తిపై అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన చెడిపడా గ్రామానికి చెందిన బాలు మాలిక అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ALSO READ : సూర్యాపేట : 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
అక్రమ రవాణాలో భాగస్వాములైన సంజీవ్ బ్యూరో, ఎలియా రైక, ఓసియా రై కానీ, అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఒడిస్సా నుంచి గంజాయి, మద్యం అక్రమ రవాణా జరక్కుండా ప్రత్యేక నిఘా వేశామని ఎస్సై రాజేష్ తెలిపారు.









