జాతీయంBreaking NewsTOP STORIES

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఇప్పుడు ఇండియాలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ కు బాడీ డిమాండ్ ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యుడు కనీసం ఒక తులం బంగారం కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొన్నది.

24 క్యారెట్స్ గోల్డ్ ప్రస్తుతం తులం బంగారం 73 వేల రూపాయలు దాటింది. ఇక త్వరలో లక్ష రూపాయలు కూడా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్స్ గోల్డ్ తులం ధర 68 వేల రూపాయలకు అయితే సామాన్యుడికి అందుబాటులో బంగారం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు వినిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 క్యారెట్ల బంగారం తీసుకురాబోతుంది. బంగారంకు మార్కెట్లో ఉన్న డిమాండ్ తో పాటు పెరుగుతున్న ధరలతో సామాన్యులకు కూడా బంగారం అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 9 క్యారెట్స్ తులం బంగారం ధర 25 వేల నుండి 30 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.

బంగారం ఏ మేరకు స్వచ్ఛంగా ఉందనేది హాల్ మార్క్, బిఎస్ఐ ముద్రలు ఉంటాయి. కొత్తగా వచ్చే 9 క్యారెట్స్ బంగారం కూడా నాణ్యత దృవీకరణ వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే 9 క్యారెట్స్ గోల్డ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.

22 క్యారెట్ గోల్డ్ తో రెడీమేడ్ ఆభరణాలు దొరుకుతున్నప్పటికీ బిస్కెట్ బంగారం కోసం జనం ఎగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో 9 క్యారెట్స్ గోల్డ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూద్దాం.

LATEST UPDATE : 

Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు 8లో.. సోనియా ఎవరో తెలుసా..!

Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

మరిన్ని వార్తలు