TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : బంగారం ధరలు ఒకేసారి ఢమాల్.. ఒక్కరోజే రూ.33,800 తగ్గింది..!

Gold Price : బంగారం ధరలు ఒకేసారి ఢమాల్.. ఒక్కరోజే రూ.33,800 తగ్గింది..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు ఒకేసారి ఢమాల్ అన్నాయి. దీపావళి పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు కొంత మేరకు తగ్గిన బంగారం ధర బుధవారం మళ్లీ ఒక్కసారిగా భారీగా తగ్గింది. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 33,800 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ (తులం) బంగారం కు 3,380 రూపాయలు తగ్గి 1,27,200 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాముల తులం బంగారం కు 3100 రూపాయలు తగ్గి 1,16,600 రూపాయలుగా ఉంది.
హైదరాబాదులో ఉన్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, నల్గొండ పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :









