వృద్ధురాలు మెడలో నుండి బంగారం గుండ్లు అపహరణ

వృద్ధురాలు మెడలో నుండి బంగారం గుండ్లు అపహరణ

చింతపల్లి. మన సాక్షి

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని తక్కలపల్లి గ్రామంలో ఓ వృద్దు రాలి మెడలో నుండి తులం బంగారం గుండ్లను నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని ఇరువురు దుండుగలు దొంగిలించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు పోలీసులు తెలిపి వివరాల ప్రకారం..

 

రాసోజు సాంబమ్మ అదే గ్రామానికి చెందిన రాసోజు చంద్రయ్య ఇంటి ముందు ఒంటరిగా నిద్రకు ఉపక్రమించింది. ఆమె నిద్రలో ఉన్న సమయాన్ని గుర్తించిన దుండగలు ఆమె మెడలో ఉన్న ఒక తులం బంగారు గుండ్లను దొంగిలించారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ఉదయం స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు.

 

.వెంటనే ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ సత్తెమ్మ చింతపల్లి పోలీసులకు సమాచారం అందించారు. విషయాన్ని తెలుసుకున్న నాంపల్లి సిఐ విటల్ రెడ్డి చింతపల్లి ఎస్ఐ బాలకృష్ణ స్పందించి వెంటనే తక్కలపల్లి గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు బాధితులను సంఘటన విషయాన్ని ఆ వృద్ధురాలని అడిగి తెలుసుకున్నారు.

 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో స్థానిక ఉప సర్పంచ్ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి సిసి ఫుటేజ్ ద్వారా నేను నిందితులను పట్టుకుంటామని సిఐ విటల్ రెడ్డి పేర్కొన్నారు.

 

గ్రామ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆ ధైర్యపడవద్దని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తుతెలియ వ్యక్తులు ఎవరైనా గ్రామానికి వచ్చినట్లయితే తమకు వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు.