Good news : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!
Good news : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త అందించింది. వంట నూనె ధరలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల సామాన్యులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వంట నూనె ధరలు కొంతమేరకు తగ్గినా… కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో కూడా వంట నూనె ధరలు తగ్గించాలని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు సూచించింది. దీంతో కుకింగ్ ఆయిల్ ధరను ఆరు శాతం తగ్గించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించుకున్నాయి.
గత ఆరు మాసాల కాలంలో చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనె ధరలు భారీగా దిగి వచ్చాయి. ఇటీవల రెండు నెలల నుంచి ఆ ధరలు ఇంకా కొద్దిగా తగ్గాయి. వేరుశనగ , సోయాబీన్, మస్టర్డ్ ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. అయినా దేశీయ మార్కెట్లో వంటనూనె ధరలు తగ్గలేదు.
దాంతో కేంద్రం ధరలు తగ్గించాలని ఆయిల్ కంపెనీలకు సూచించడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. ఒక లీటర్ ఆయిల్ కు ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో సామాన్యులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది.









