Breaking NewsTOP STORIESవ్యవసాయం

Thummala : రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ పథకం పునరుద్ధరణ..!

Thummala : రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ పథకం పునరుద్ధరణ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. గత పది సంవత్సరాల క్రితం ఉన్న సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీ పథకాన్ని తొలగించారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీ పథకాన్ని పునరుద్ధరించే ఆలోచన ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రైతన్నల ఆదరణతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీపై అందజేసే పరికరాల పథకాన్ని మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి రుణమాఫీ గురించి ఏనాడు పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయన్నారు.

కష్టమైనప్పటికీ ఒక పథకాన్ని ఆపైన సరే రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ చేస్తామన్నారు. రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కువ పంటలు సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

LATES UPDATE :

 

మరిన్ని వార్తలు