Rythu : అన్నదాతలకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..!
Rythu : అన్నదాతలకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ..!
మనసాక్షి, వెబ్ డెస్క్:
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేసే ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందజేయున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్హులైన రైతుల ఖాతాలలో ప్రతి సంవత్సరం 6000 రూపాయలను పీఎం కిసాన్ పథకం ద్వారా అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఆ డబ్బులను రైతుల ఖాతాలలో నేరుగా మూడు విడుదలగా అందజేస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాలలో 17 విడతలుగా డబ్బులను అందజేసింది. కాగా 18వ విడత నిధులు కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది పేద రైతులకు పిఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతి విడుత 2000 రూపాయలను అందజేస్తుంది. ఈ నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అందజేస్తుంది. కాగా 18వ విడత 2000 రూపాయల నగదును రైతుల బ్యాంకు ఖాతాలలో రేపు (అక్టోబర్ 5)వ తేదీన జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రైతులు కూడా బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింకు, కేవైసీ అన్ని సక్రమంగా ఉన్నాయో లేవో సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
LATEST UPDATE :
-
Cm Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్ అందరికీ..!
-
Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!
-
Nalgonda : పేదలందరికీ ఇండ్లు, రూ.5 లక్షలు అందజేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!
-
Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!









