Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేయునది. నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఒక్కొక్క ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రెండు విడతలుగా రైతు భరోసా పలకాన్ని అమలు చేయనున్నారు. మార్చి 31వ తేదీలోగా రైతు భరోసా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మొదట్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు పంట సహాయంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు.
నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకం నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు నిధులు వెంటనే వారి వారి ఖాతాలలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు భరోసా కు సంబంధించిన నిధుల సమీకరణలో ఉన్నారు.
జూన్ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు
నిర్వహిస్తున్నారు. జూలై మాసంలో రాబోయే వానాకాలం సీజన్ రైతు భరోసా నిధుల సేకరణకు అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. త్వరలో 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు వంట సహాయంగా రైతు భరోసా అమలు కానున్నది.
ఇవి కూడా చదవండి
-
Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన బొలెరో..!
-
District collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..!
-
Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!
-
ReSL: నెట్ జీరో లక్ష్యానికి ఊతం.. రీ సస్టైనబిలిటీ ఐఎస్‌ఎస్‌తో సరికొత్త శకం..!
-
PhonePe : ఫోన్ పే, ఇవేం డిజిటల్ పేమెంట్స్ రా బాబు.. లేటెస్ట్ అప్డేట్..!









