TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Good News : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. సేల్స్ ఎంపోరియం ఏర్పాటు..!

Good News : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. సేల్స్ ఎంపోరియం ఏర్పాటు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. చేనేత ఉత్పత్తులకు సంబంధించి సేల్స్ ఎంపోరియం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య పేర్కొన్నారు.

భవన నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లుం టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. సోమవారం నారాయణపేట లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లోని నిర్మాణంలో ఉన్న కామన్ ఫెసిలిటీ సెంటర్ హ్యాండ్లూమ్ భవనం పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నెలల లోపు భవన నిర్మాణ పనులు పూర్తిచేసి హ్యాండ్లూమ్ సెంటర్ లో సేల్స్ ఎంపూరిమ్, హ్యాండ్లూమ్ మ్యూజియం రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఫుడ్ కోర్ట్, డేయింగ్ యూనిట్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అప్పగించాలన్నారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ఇంటరాక్షన్ వారి వివరాలు, చేనేత పనులపై ఆరా తీశారు. నెలలో ఎన్ని చీరలు నేస్తారని చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. నారాయణపేటలో చేనేత ఉత్పత్తులు పెరగాలని అందుకొరకు ప్రత్యేకంగా భవన పనులు పూర్తిచేసి సేల్స్ ఎంపోరియం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

చేనేత చీరలలోని డిజైన్లు గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. చేనేత పరిశ్రమలో నారాయణపేట ముందంజలో ఉందని ఇంకా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, రతన్ కుమార్, కాప్రాస చారీ, కలిగినా రెడ్డి, చేనేత జౌలి శాఖ ఏడి. దాసరి బాబు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Runamafi : రుణమాఫీ అయినా.. ఆ డబ్బులు చెల్లించాల్సిందే, బ్యాంకులకు వెళ్తే అసలు విషయం..!

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

Tungabhadra : కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. దిగువకు ఫోటెత్తిన నీరు..!

 

మరిన్ని వార్తలు