Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతుల కోసం కు శుభవార్త తెలియజేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రైతు బీమా పథకంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సులభంగా పరిష్కరించుకునే వీలు కోసం మొబైల్ యాప్ నె తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయ భూమి పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న రైతులకు 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి రైతు బీమా పథకం వర్తిస్తుంది. రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకొని ఉంటే వారు మరణిస్తే కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ప్రభుత్వం అందజేస్తుంది.
ఈ పథకం దరఖాస్తు కోసం సాంకేతిక సమస్యలను తొలగించి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. ఐదు లక్షల రూపాయల సహాయం అందజేయడానికి రైతు బీమా పథకం కోసం జీవిత బీమా సంస్థకు గత పది సంవత్సరాల నుంచి రైతుల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
కానీ పథకం అమలు చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో పది శాతం మంది రైతులకు సహాయం అందడం లేదని చెప్పవచ్చును.
వయస్సు నిర్ధారణల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఆధార్ కార్డులో తప్పులు ఉండడం, నామినీ పేర్లు సరిగా నమోదు చేయకపోవడం, మరణ ధ్రువీకరణ పత్రాలు సరైన సమయంలో అందకపోవడం, ఇతర కారణాలవల్ల రైతులకు ఐదు లక్షల రూపాయల సహాయం అందడం లేదు.
అదేవిధంగా కొత్తగా రైతు బీమా కోసం రైతులు పేర్లు నమోదు చేసుకునే విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు గాను మొబైల్ యాప్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఈ యాప్ ద్వారా రైతులు, నామినీల వివరాలను నమోదు తో పాటు మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా అప్లోడ్ చేయడం, సహాయం చెల్లింపు చేయనున్నారు.
LATEST UPDATE :
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!
Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!
Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









