Breaking Newsతెలంగాణ

TG News : పేదలకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!

TG News : పేదలకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలోని పేదలకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 4.50 లక్షల గృహాలను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలను మొదటి విడతగా నిర్మించనున్నారు.

ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంపై కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మొదటి విడతలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.

అందుకుగాను ఈ నెల 5వ తేదీన యాప్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో చేపడతామని చెప్పారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజురు చేయనున్నట్లు తెలిపారు.

అదే విధంగా రైతు భరోసా పథకం కూడా సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని, ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.

నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50,000 మందికి ఉద్యోగ నియమాక పత్రాలు అందజేసినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు