జాతీయంBreaking NewsTOP STORIES

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు మరో 9 రకాల నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయించింది.

కరోనా సమయం నుంచి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందజేస్తున్న విషయం తెలిసిందే. మొదటగా కొద్ది రోజులపాటు ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత గడువు పెంచుతూ ఇప్పటి వరకు కూడా ఉచిత బియ్యం అందజేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పేదలను ఆదుకునేందుకు ఉచిత రేషన్ బియ్యం తో పాటు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను కూడా అందజేయాలని భావిస్తుంది.

దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి గుడ్ న్యూస్ తెలియజేసింది. తెల్ల రేషన్ కార్డుదారులకు 9 రకాల నిత్యావసర వస్తువులలో ఉచిత బియ్యంతో పాటు గోధుమలు, పప్పులు, చక్కెర, ఉప్పు, నూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు, కారం అందించాలని నిర్ణయించింది.

అయితే కొన్ని ప్రాంతాలలో బియ్యం కు బదులు కొన్నింటిని ఇస్తానని తెలుస్తోంది. పేద వారి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు పౌష్టికాహారం స్థాయిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల సరుకులను పంపిణీ చేయడం వల్ల ప్రజాజీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

బయట మార్కెట్లో నిత్యవసర వస్తువుల సరుకుల ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ దుకాణాల్లో నిత్యవసరాలు అందజేయాలని ప్రభుత్వం భావించింది.

LATEST UPDATE : 

Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

రేపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు