Breaking NewsTOP STORIESజిల్లా వార్తలునల్గొండ

Ration Cards : రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం భారీ శుభవార్త..!

Ration Cards : రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం భారీ శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు.

తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ 2025 జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందజేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమన్నారు. సన్నధాన్యంకు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 30.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తామని ఆయన తెలిపారు. 2025 జనవరి మాసం నుంచి రేషన్ షాపుల్లో ఉచితంగా సన్నబియ్యం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు