Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
నల్లగొండ, మన సాక్షి .
ఈనెల 15న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నల్గొండ లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా తిరుపతి ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్న స్నాతకోత్సవ వేదికను పరిశీలించారు
అనంతరం ఆర్ట్స్ కాలేజీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి బాధ్యతలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏర్పాట్లు, ఇతర అంశాలను అందులో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
15 న ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను, మెడికల్ టీం, 108,104 ,ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, అలాగే డయాస్ ఇతర ఏర్పాట్లు ఆర్ అండ్ బి అధికారులు చూడాలని , తాగునీరు, శానిటేషన్, ఫాగింగ్ వంటివి చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ముందు నుండే ఎం జి యూనివర్సిటీ లో పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తామని, తనిఖీలు ఉంటాయని, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే ఆ రోజు లోపలికి అనుమతించడం జరుగుతుందని, గేటు వద్ద తనిఖీ కోసం యూనివర్సిటీ తరఫున నలుగురు బృందం సభ్యులు ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్స్ లను కోరారు .రాష్ట్ర గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే అందరి పేర్ల జాబితాను ముందే సమర్పించాలని ఆయన కోరారు.
అంతకు ముందు యూనివర్సిటీ వైట్ ఛాన్సర్ ఖాజా అల్లా హుస్సేన్ మాట్లాడుతూ ఈనెల 15 న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో భాగంగా ఉదయమే స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రాథమిక సమాచారం మేరకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ వస్తారని, తర్వాత కాన్వకేషన్ లో పాల్గొంటారని, ఈ సందర్భంగా 22 మంది పి హెచ్ డి సాధించిన విద్యార్థులు, 57 మంది గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం ఉంటుందని, అనంతరం గవర్నర్ ప్రసంగం ఉంటాయని, ఒంటిగంటకు కార్యక్రమాల అనంతరం గవర్నర్ తిరిగి వెళ్తారని,రాష్ట్ర గవర్నర్ కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించేందుకు గాను యూనివర్సిటీలో సుమారు 12 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఎం జి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ,జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్ ,ఎలక్ట్రిసిటీ డి ఈ నదీం అహ్మద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్డిఓ అశోక్ రెడ్డి ,ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథఅధికారులు,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..!
-
Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!
-
Aadhaar Centers : ఆధార్ కేంద్రాల్లో దోపిడీ.. అదనపు వసూళ్లు.. పట్టించుకోని అధికారులు..!
-
Karimnagar : వైద్యం కోసం వెళ్తే.. మత్తు ఇచ్చి యువతీపై అఘాయత్నం..!
-
District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!










