Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవైద్యంహైదరాబాద్

Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!

Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది . ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలు నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం విధితమే. కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

1827 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రులలో 1827 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

 

Also Read : Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!

 

వైద్య విద్య కోసం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని, అందుకుగాను మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో అవసరమైన వైద్యులను నర్సులను ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

 

ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ పూర్తి చేసి వారికి టీచింగ్ ఆసుపత్రిలో నియమించినట్లు తెలిపారు. తాజాగా 1827 మంది స్టాఫ్ నర్స్ లను భర్తీ చేయబోతున్నామని హరీష్ రావు ప్రకటించారు. దీంతో ప్రజలకు మరింత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

 

Also Read :

Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!

Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!

Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!

మరిన్ని వార్తలు