ఉపాధ్యాయుడు లేకపాయే…. పాఠాలు చెప్పరాయే..!

ఉపాధ్యాయుడు లేకపాయే.... పాఠాలు చెప్పరాయని విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో రెండు నెలలు పదో తరగతి పరీక్షలు

ఉపాధ్యాయుడు లేకపాయే…. పాఠాలు చెప్పరాయే..!

– హిందీ టీచర్ లేక విద్యార్థుల ఇబ్బందులు

– మరో రెండు నెలలు పబ్లిక్ పరీక్షలు… ఎలా రాయాలి

వేములపల్లి, మన సాక్షి:

ఉపాధ్యాయుడు లేకపాయే…. పాఠాలు చెప్పరాయని విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో రెండు నెలలు పదో తరగతి పరీక్షలు ఉండగా…. హిందీ సబ్జెక్టు బోధించడానికి ఉపాధ్యాయుడు లేడన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పడింది.

ALSO READ : BREAKING : గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు హిందీ సబ్జెక్ట్ చెప్పడానికి ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పదవ తరగతిలో ఉత్తమ స్కోరు సాధించడానికి హిందీ సబ్జెక్ట్ తోడుంటుంది. మరో రెండు నెలలు పబ్లిక్ పరీక్షలు ఉండగా…. హిందీ పరీక్ష ఎలా రాయాలని విద్యార్థులు తర్జనభజన పడుతున్నారు.

మండలంలోని ప్రతి సంవత్సరం పబ్లిక్ పరీక్షలులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన స్థానంలో నిలుస్తుంది. ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక…. విద్యార్థులకు సబ్జెక్టు బోధించకుండానే వదిలేశారు. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి హిందీ టీచర్ ని నియమించాలని డిమాండ్ చేశారు.

ALSO READ : Free Bus : ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు.. షాకింగ్ న్యూస్..!