TOP STORIESBreaking News

TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!

TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ కార్డులు రానున్నాయి. రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) వారికి రేషన్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు దారిద్ర రేఖకు ఎగువన ఉన్న (APL)వారికి కూడా ప్రభుత్వం కార్డులను జారీ చేయనున్నది.

బిపిఎల్ కార్డు ఉన్నవారికి సబ్సిడీ తో కూడిన సరుకులు అందజేయనున్నారు. కాగా ఏపియల్ వారికి ప్రభుత్వం గ్రీన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులుగా చిప్ లతో సహా ఉండనున్నాయి.

తెల్ల రేషన్ కార్డు స్థానంలో ఇక మూడు రంగుల కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా గులాబీ రంగు కార్డు స్థానంలో గ్రీన్ కార్డును పంపిణీ చేస్తారు. గ్రీన్ కార్డుదారులకు కేవలం అవి గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగపడతాయి. ప్రభుత్వ సబ్సిడీ సరుకులు అందజేయబడవు.

మే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నందున సన్నబియ్యం పంపిణీకి ఇంకా పూర్తిస్థాయిలో ప్రభుత్వం సమయత్వం కాలేదు. మే నెల నుంచి బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు.

ముందుగా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మే నెల నుంచి పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.

MOST READ : 

  1. Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!

  2. Miryalaguda : గ్రూప్ వన్ ర్యాంకర్ కు సన్మానం..!

  3. Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!

  4. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

  5. District collector : పేద విద్యార్థినికి జిల్లా కలెక్టర్ బాసట..! 

మరిన్ని వార్తలు