తెలంగాణBreaking Newsహైదరాబాద్

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ కార్డుల ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు ప్రజా పాలన ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది తమకు రేషన్ కార్డులు కావాలని ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డులను మంజూరు చేయడానికి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈనెల 21వ తేదీన మరోసారి కూడా సబ్ కమిటీ సమావేశం కానున్నది. సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో విధి విధానాలు రూపొందించే ప్రక్రియలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో రేషన్ కార్డుల విధి విధానాలపై అధ్యయనం ఇప్పటికే పూర్తి చేశారు. కాగా ఆయా రాష్ట్రాలలో రేషన్ కార్డుల జారీకి పాటించిన విధివిధానాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణలో కూడా నిర్ణయించనున్నారు.

త్వరలో అర్హులైన వారందరికీ అక్టోబర్ మాసంలో తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులు మంజూరుకు విధివిధానాలను త్వరలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 30.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానున్నదని, ఆ సమావేశంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు విధివిధానాలను రూపొందించి వెల్లడిస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

LATEST UPDATE : 

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

మరిన్ని వార్తలు