District collector : గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..!
District collector : గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ఈనెల 17, 18 తేదీలలో నిర్వహించబోయే
గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 17, 18 తేదీలలో జరగబోయే గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి శిక్షణ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష కొరకు 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, 4200 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు తెలిపారు.
డిపార్ట్మెంటల్ అధికారులు 14,ఫ్లైయింగ్ స్క్వేడ్స్ టీం 4,ఐడెంటిఫికేషన్ అధికారులు 45,రూట్ ఆఫీసర్స్ 4,చీఫ్ సూపరింటెండెంట్స్ 13 మంది,
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ కొరకు చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అబ్జర్వర్ లు ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు.
చీఫ్ సూపర్డెంట్ లు తమ యొక్క సెంటర్ నందు పరీక్ష నిర్వహణకు కావలసిన మౌలిక సదుపాయాలైన, త్రాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, శానిటైజేషన్, ఏర్పాటు చేసుకోవాలని, అన్నారు.
తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తు ఉండాలని, సెంటర్ కు మూడు కిలోమీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని, తెలియజేశారు.
పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్ విధించాలని, పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ సిబ్బందిని నియమించాలని తెలి పారు. విద్యుత్ శాఖ సిబ్బంది పరీక్ష కేంద్రాలలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ఆర్టీసీ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రూప్ 3 పరీక్ష రాయబోయే అభ్యర్థులకు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని తెలియజేశారు.
ఆరోగ్యశాఖ సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎం, ఆశా వర్కర్ లతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఏ ఒక్కరిని ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లను అనుమతించ కూడదని అధికారుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు,ఆర్. డి. ఓ. రాంచందర్ నాయక్, తహసిల్దార్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ చీఫ్ సూపర్డెంట్లు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :









