Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : సూర్యాపేట గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య..!

BREAKING : సూర్యాపేట గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య..!

ఇటీవలనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

సంఘటన మరువక ముందే మరో ఆత్మహత్యతో విద్యార్థుల ఆందోళన

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలో బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె ఇరుగు అస్మిత (15) శనివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది.

ఈ నెల 10వ తేదీన ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి పాఠశాలలో అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. దాని కారణంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులు పాటు (హోం సిక్) సెలవులు పాఠశాలకు ఇవ్వడంతో సెలవుల కోసం అస్మిత మోతి మండలంలోని ఇంటికి వెళ్ళింది.

శనివారం ఉదయం అస్మిత తల్లి జ్యోతి హాస్టల్ కి వెళ్దామని అస్మిత కి చెప్పి రోజువారీగా తన తల్లి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్ కి చున్నితో ఉరేసుకుని మరణించినట్లు తెలిపారు. పాఠశాలకు వెళ్లే రోజే ఆత్మహత్య చేసుకోవడం అనుమానస్పదంగా మారింది.

ALSO READ : మిర్యాలగూడ వాసికి.. ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు