Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!

Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో పేదలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. గత నాలుగు రోజులుగా ఏర్పడిన సందిగ్దానికి తెరపడింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
మీసేవ అధికారులతో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మీసేవ ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారు. కొత్త దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను పునరుద్ధరించారు ఒక్కో దరఖాస్తుకు 50 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకోవాలని మీసేవ నిర్వాహకులను అధికారులు ఆదేశించారు.
జనవరి 26వ తేదీన రాష్ట్రంలో పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 7వ తేదీన కొత్త దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు రాత్రి 8 గంటలకు పోర్టల్ ను ఆఫ్ చేశారు.
దాంతో ఎనిమిదో తేదీన దరఖాస్తుల కోసం మీసేవ చుట్టూ ప్రజలు భారీగా భారులు తీరారు. అయినా కొత్త దరఖాస్తులు ఆప్షన్ లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను మీసేవ ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రజా పాలన, ప్రజావాణి, గ్రామసభలలో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!
-
Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!









