TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!

WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హ్యాకింగ్ న్యూస్ విరివిగా వినపడుతోంది. సోషల్ మీడియా అకౌంట్లు సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేసి బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇలాంటివి హ్యాక్ చేసి మొదట్లో డబ్బులు కావాలని రిక్వెస్ట్ అడగడం.. ఆ తర్వాత అకౌంట్ ఖాళీ చేయడం.. ఇది పరిపాటిగా మారింది.

అకౌంట్లు హ్యాక్ అవుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాలని, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. అయితే మీ వాట్సాప్ ఎకౌంటు హ్యాక్ అయిందని మీరు అనుకుంటున్నారా..? ఒకవేళ హ్యాక్ అయితే మీరు ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • మీరు వాట్సాప్ యాక్సెస్ చేసినప్పుడు సడన్ గా ” your puone number is no longer registered’ అని మెసేజ్ స్క్రీన్ పై కనిపిస్తే మీరు జాగ్రత్త పడాలి.

  • అదేవిధంగా మీ వాట్సాప్ ఎకౌంట్ ప్రతిసారి మీరు ఏం చేయకుండానే లాగౌట్ అవుతుంటే కూడా అలర్ట్ కావాలి.

  • మీ ఫోన్లో లాగౌట్ అయిందంటే మీ నెంబర్ పై నేరగాళ్లు వాట్స్అప్ వాడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

  • మీరు మెసేజ్ ఎవరికి పంపకపోయినా అవతలివారు నుంచి రిప్లై వచ్చిందంటే జాగ్రత్త పడండి.

    మీ వాట్స్అప్ హాక్ చేసిన వాళ్లు మెసేజ్ సెండ్ చేసినట్లుగా భావించాలి.

  • అదేవిధంగా లింక్డ్ డివైస్ ఆప్షన్ లోకి వెళ్లి చెక్ చేసుకోవడం చాలా మంచిది.

  • వేరే వాళ్ళు వేరే డివైస్ లో లాగిన్ చేస్తే మీరు దాన్ని వెంటనే తెలిసిపోతుంది. దాన్ని ఇనాక్టివేట్ చేసుకోవాలి.

  • ఒక్కోసారి మీ ప్రమేయం లేకుండానే మీ నెంబర్ వాట్సప్ గ్రూపులో యాడ్ అవుతుంది. అదే విధంగా వాట్స్అప్ కాంటాక్ట్ లిస్టులోకి కొత్త నెంబర్లు యాడ్ అయినా మీరు జాగ్రత్త పడాలి.

ఇలాంటి సంకేతాల ద్వారా మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లుగా భావించి జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

MOST READ 

  1. District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!

  2. CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!

  3. EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  4. CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!

మరిన్ని వార్తలు