Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ 2025 జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డులకు అనేకమంది దరఖాస్తులు చేసుకున్నారు.
ప్రజా పాలన ద్వారా గ్రామసభల ద్వారా ఎంతోమంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే దరఖాస్తు స్థితిని (స్టేటస్) సులభంగా ఆన్‌లైన్ లో చెక్ చేసుకోవచ్చును. అయితే ఎలా చెక్ చేసుకోవాలి. అర్హతలు ఇతర విషయాలు తెలుసుకుందాం…
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు గ్రామపంచాయతీ కార్యదర్శులను సంప్రదించవచ్చును అని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ వివరణ పొందిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక మండలాధికారులను కూడా సంప్రదించవచ్చును. వారు మీ దరఖాస్తు స్టేటస్ ను వెల్లడిస్తారు.
ముందుగా తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ ను ఓపెన్ చేయాలి.
https://epds.telangana.gov.in/FoodSecurityAct/ హోం పేజీలో FSC search ఆప్షన్ పై క్లిక్ చేయాలి. FSC అప్లికేషన్ సెర్చ్ ఎంచుకోండి. రేషన్ కార్డ్ సెర్చ్ కింద ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ ఎంచుకోండి. అక్కడ మీరు మీ జిల్లా ఎంచుకోవాలి. ఆ తర్వాత మీసేవ దరఖాస్తు చేసిన రసీదు నెంబర్ లేదా దరఖాస్తు నెంబర్ ను నమోదు చేయాలి. లేదా మీ ఆధార్ నెంబర్, ఎఫ్ ఎస్ సి రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ఉపయోగించి స్టేటస్ చెక్ చేయవచ్చును.
వివరాలను నమోదు చేసిన తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీ రేషన్ కార్డు దరఖాస్తు స్థితి స్క్రీన్ పై కనిపిస్తుంది. మీ దరఖాస్తు ఆమోదించబడితే మీ పేరు ఆమోదిత జాబితాలో ఉంటుంది. మీరు రేషన్ కార్డును అప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించబడితే తిరస్కరణ జాబితాలో ఉంటుంది. అయితే ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొని మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చును.
MOST READ :
-
Miryalaguda : మల్టీపర్పస్ సిబ్బందికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ భరోసా..!
-
ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!
-
District Collector : ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!
-
Hyderabad : హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!









