Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

మనసాక్షి, నల్గొండ/ మాడ్గులపల్లి:

తెలంగాణలో మద్యం టెండర్లకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇటీవల లక్కీ డ్రా లో కేటాయింపులు కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2601 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఒక్కొక్క మద్యం దుకాణానికి వందలాది మంది కూడా దరఖాస్తు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసి కేటాయింపులు చేశారు. ఎంతో మంది అదృష్టం దక్కకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.

ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి లిక్కర్ షాప్ కోసం టెండర్ వేశాడు. కానీ అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్ స్థానిక రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తుండేవాడు. గతంలో ఆ రైస్ మిల్ యజమాని అశోక్ పేరిట మద్యం షాపులకు దరఖాస్తులు చేసేవాడు.

కాగా ఈసారి అశోక్ సొంతంగా మాడ్గులపల్లి లోని ఓ మద్యం దుకాణానికి ఈ నెల 18వ తేదీన దరఖాస్తు చేశారు. కాగా డ్రా కంటే ముందు మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అశోక్ హైదరాబాదులో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ సమయంలో నల్గొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ఎంపిక జరిగింది.

మాడుగులపల్లి లోని నెంబర్ 63వ షాపు అశోక్ పేరిట వచ్చింది. అయితే మద్యం షాపు వచ్చిన విషయం తెలియకుండానే అశోక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం మృతుని కుటుంబ సభ్యులలో ఒకరికి దుకాణం కేటాయించనున్నట్లు ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ సంతోష్ పేర్కొన్నారు.

MOST READ :

  1. Paddy parches : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి..!

  2. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

  3. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

  4. Nalgonda : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్..!

మరిన్ని వార్తలు