Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్..!

Nalgonda : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్..!

చింతపల్లి, మనసాక్షి :

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలం మొద్దుగుల మల్లేపల్లి గ్రామంలో శ్రీ కూర్మ చల సీతారామ చంద్ర లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు శ్రీ రామచంద్ర స్వామి అనుగ్రహం పొందాలి అని ఆయన వారు పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి సమ్మిడి జయప్రకాశ్ రెడ్డి ,మాజీ సర్పంచ్ మర్ల వెంకటయ్య, సమ్మిడి విజయరాంరెడ్డి, శ్రీనివాస్, రమేష్,మోతిరాం నాయక్, వేద పండితులు, ఆలయ నిర్మాణ దాతలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Friendship : స్నేహమంటే ఇదే.. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు..!

  2. Hand Ball : రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

  4. Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!

మరిన్ని వార్తలు