తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యంసూర్యాపేట జిల్లా

Suryapet : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే హెల్తీ ఫై ఆసుపత్రి లక్ష్యం..!

Suryapet : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే హెల్తీ ఫై ఆసుపత్రి లక్ష్యం..!

సూర్యాపేట, మనసాక్షి :

పేద ప్రజలకు, విద్యార్థులకు సేవ చేయాలని లక్ష్యంతోనే నర్సింగ్ కళాశాల, హెల్తిపై హాస్పిటల్ ను ప్రారంభించామని హెల్తీ ఫై ఆసుపత్రి అధినేత మతకాల చలపతి రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని హేల్తీపై హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత నాలుగు సంవత్సరాలనుండి హెల్తీఫై హాస్పటల్ ఆసుపత్రిని ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వైద్యం అంటే వ్యాపారం కాదని అది సేవ ప్రజలకు సహాయం చేయాలనే సేవా దృక్పథంతోనే నేను ముందుకు వచ్చామని తెలిపారు. పేద ప్రజలకు, వారి పిల్లలకు నర్సింగ్ విద్యలో సహాయం చేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

దాంతోనే కొన్ని గ్రామాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తు పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం అని వివరించారు.నేను డాక్టర్ కాకపోయినా మా కూతురు డా. మతకాల అపర్ణ (న్యూరో ఫిజీషియన్), డా. హరికృష్ణ (ఆర్థోపెడిక్)మతకాల శైలజ ప్రోత్సాహంతో ఇంకా మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు.

హెల్తీఫై హాస్పిటల్ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న వైద్యులు డా. గిరిధర్ నాయక్, డా. రమేష్ నాయక్, డా. రవి, డా. వెంకన్న, డా. ఉపేందర్ సింగ్, డా. కుమార్, డా. ఆనంద్, డా. సుశిక్షత, డా. నవీన్, డా. సందీప్, డా. రఘురాంలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే నా సిద్ధాంతం అని ఆయన స్పష్టం చేశారు.

గత 25 సంవత్సరాలుగా నర్సింగ్ విద్య ద్వారా చేసిన సేవలను స్మరించుకుంటూ, హేల్తీపై హాస్పిటల్ ద్వారా ఇప్పటివరకు సుమారు 5000 మందికి వైద్య సేవలు అందించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత కష్టతరమైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అనంతరం వైద్యులను శాలువాతో సన్మానించారు. అనంతరం వార్షికోత్సవ వేడుకలను సిబ్బంది, వైద్యుల నడుమ ఘనంగా నిర్వహించారు.

MOST READ :

  1. Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!

  2. Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

  3. TG News : తెలంగాణలో మంత్రుల మద్య వివాదం ముగిసిందా.. పొన్నం ఏం చెప్పారు..!

  4. Rain : వర్షంలో తడిస్తే జ్వరం ఎందుకు వస్తుంది.. నిజాలు ఇవే..!

  5. Suryapet : ఎంబిబిఎస్ సీటు సాధించిన రైతు బిడ్డ..!

మరిన్ని వార్తలు