గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

పినపాక. మన సాక్షి

గుండెపోటుతో వెటర్ని ఉద్యోగి మృతి చెందిన సంఘటన పినపాకలో బుధవారం చోటుచేసుకుంది. పినపాక పశువుల వైద్యశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పండా శ్వేత (40) గుండెపోటుతో కొత్తగూడెం ప్రవేట్ ఆస్పత్రిలో మృతి చెందింది.

 

గత కొన్ని రోజుల నుండి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. తండ్రి, తల్లి చనిపోవడంతో అనాధ అయిన కూతురు. శ్వేతా మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో ఉన్నారు.